మునుగోడు మండలానికి చెందిన ఆరుగురు యువకులు గంజాయి విక్రయిస్తుండగా జూలై 20 న అప్పటి ఎస్సై వెంకటేశ్వర్లు ఆరుగురిపై కేసు నమోదు చేయగా, అందులో ఒకరు పారిపోవడంతో, ఐదుగురిని రిమాండ్ కు తరలించారు. అప్పుడు పారిపోయిన ఆ గంజాయి విక్రేత ఆకారపు గణేష్ శనివారం పట్టుబడడంతో సీఐ అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.