చండూర్ పురపాలకలో మంగళవారం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పర్యటించారు. బీసీ బాలుర వసతి గృహం, ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రికార్డులను పరిశీలించారు. హాస్పిటల్లో రోగులతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు. అనంతరం నిలిచిపోయిన డబుల్ రోడ్ పనులను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.