రైతుల వడ్ల లోడ్ ఎత్తమంటే సీఎం మహారాష్ట్రకు నోట్లకట్టల లోడ్ ఎత్తుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం మర్రిగూడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడుతూ జిల్లాలో ఏడున్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అంచనా వేసిన ప్రభుత్వం మూడు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల, చిరుమర్తి, తదితరులు పాల్గొన్నారు.