నల్లగొండ జిల్లా నాంపల్లి మండల తహశీల్దార్ కి ధర్మ సమాజ్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ గిరి మహారాజ్, మండల అధ్యక్షుడు సుధాకర్ మహారాజ్, మండల ఉపాధ్యక్షులు చిరంజీవి మహారాజ్, గిరి రావణ్, తదితరులు పాల్గొన్నారు.