పత్తి పంటను ఎటాంటి టార్గెట్ లేకుండా సీసీఐ అధికారులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని పత్తి రైతులు యరగండ్లపల్లిలోని ఒక ప్రైవేట్ కాటన్ మిల్లు దగ్గర రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరసగా మూడు రోజుల నుంచి పత్తి కొనుగోళ్లు జరగలేదని, తిండి తిప్పలు లేకుండా సీసీఐ కేంద్రం వద్ద పడిగాపులు గాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.