చండూరు ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేత

50பார்த்தது
చండూరు ఎమ్మార్వో కి  వినతి పత్రం అందజేత
తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సమస్యలను పరిష్కరించాలని ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు నేరళ్ళ లింగయన్ కోరారు. మంగళవారం మండల కమిటీ ఆధ్వర్యంలో చండూరు మండల MRO కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా లింగయన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలొ ఉన్న ప్రజలందరికీ కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యని అందించాలని, ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అంధించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி