నల్లగొండ: క్రీమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలి
బీసీ లకు క్రీమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలనీ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు వినతి పత్రం అందించినట్లు బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్ తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రం లో బీసీ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణకు హాజరై బీసీ ఉద్యోగుల సమస్యలు విన్నవించినట్లు చెప్పారు.