వేములపల్లి: సైబర్ నేరాగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి
కుటుంబ సర్వే పేరుతో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని వేములపల్లి ఎస్సై డి. వెంకటేశ్వర్లు శనివారం అన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగాయని, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే పేరుతో ఫ్రాడ్ లింకులు పంపిస్తూ ఉంటారని, ఓటిపి వస్తుంది నెంబర్ చెప్పండి అంటూ ఎవరైనా ఫోన్ చేసి సమాచారం తీసుకోవాలని ప్రయత్నిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.