పోలీస్ శాఖలో నియామకాలకు ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ

944பார்த்தது
పోలీస్ శాఖలో నియామకాలకు ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ
నల్లమోతు భాస్కర్ రావు (ఎన్బీఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల్లో అర్హత సాధించేందుకు నిర్వహించనున్న పోటీ పరీక్షలకు ఔత్సాహిక ఉద్యోగార్ధులను సన్నద్ధం చేయనున్నట్టు ఆ సంస్థ చైర్మన్, యువనేత నల్లమోతు సిద్దార్ధ పేర్కొన్నారు. ఉచిత శిక్షణకు సంబంధించి అవసరమైన దరఖాస్తులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ లలో ఇప్పటికే అందుబాటులో ఉంచామని అన్నారు. దరఖాస్తుదారులు ఇకపై అప్లికేషన్లను మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు స్థానిక గ్రంథాలయంలోనూ పొందవచ్చని తెలిపారు. అంతేకాకుండా, ఔత్సాహిక ఉద్యోగార్ధుల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు దరఖాస్తుల గడువును ఆగస్టు 1నుంచి 10వరకు పొడిగించినట్టు తెలిపారు. పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే ఔత్సాహికులు తమ శిక్షణను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడాలని ఆకాంక్షిస్తున్నట్టు సిద్దార్ధ తెలిపారు.
కాగా, ఎన్బీఆర్ ఫౌండేషన్, మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఉమ్మడిగా మిర్యాలగూడ నియోజకవర్గ యువతకు పోలీస్ ఉద్యోగ నియామకాల కోసం ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ సహకారంతో శిక్షణ పొందిన నిరుద్యోగులు ప్రభుత్వ కొలువులు సంపాదించుకొని స్థిరపడ్డారు. 2018లో నలుగురు ఎస్సైలుగా, 33 మంది పోలీస్ కానిస్టేబుల్స్ గా ఎంపికయ్యారు. నలుగురు పంచాయతీ సెక్రెటరీలుగా, ఇద్దరు వీఆర్వోలుగా ఎంపికయ్యారు. ఇదే స్ఫూర్తి తో మరికొంతమంది నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మెరికల్లా తీర్చిదిద్దాలని, తద్వారా వారి ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేయాలని ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పూనుకున్నారు. నిరుద్యోగ యువతకు పోలీస్ శాఖ ఉద్యోగాల్లో నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி