దేవరకొండ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఇద్దరు విద్యార్థినిలు ఫీజు చెల్లించలేదని, పేరెంట్స్ ఫోన్ ఎత్తడం లేదని శుక్రవారం ఆ చిన్నారులను పాఠశాల సమయం ముగిసిన తరువాత కూడా స్కూల్లోనే ఉంచింది యాజమాన్యం. విషయం తెలుసుకున్న విద్యార్ధి సంఘాలు పాఠశాల వద్ద ఆందోళన నిర్వహించారు. అభంశుభం తెలియని చిన్నారులను ఫీజు కోసం ఇబ్బంది పెట్టిన పాఠశాల గుర్తింపును రద్దుచేసి, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.