పరిమితికి మించి ఆటోల్లో కూలీలను ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ రామ్మూర్తి హెచ్చరించారు. బుధవారం కొండమల్లేపల్లి సెంటర్ లో పేర్వాల నుండి చింతపల్లి వైపు 20 మంది పత్తి కూలీలతో వెళ్తున్న ఆటోను సీజ్ చేసి డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించొద్దని అన్నారు.