నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మర్రిచెట్టుతండాకు చెందిన గిరిజన మహిళల సాంప్రదాయ చేతి అల్లికలకు డిమాండ్ పెరుగుతోంది. గిరిజనుల హస్త కళలను నాబార్డ్ పలు ఎగ్జిబిషన్ లలో ప్రదర్శనకు అవకాశం కల్పించడంతో వారి కళా నైపుణ్యం విదేశాలకు పాకి ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ప్రభుత్వం తమకు అండగా నిలిచి చేతి వృత్తులకు మార్కెటింగ్ కల్పిస్తే మరిన్ని అల్లికలు తయారు చేస్తామని గిరిజన మహిళలు అంటున్నారు.