నాగర్ కర్నూలు జిల్లా మద్దిమడుగులో జరుగనున్న ఆంజనేయస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ శుక్రవారం దేవరకొండకు చెందిన హనుమాన్ మాలధారణ భక్తులు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో గురుస్వాములు హనుమాన్, అజయ్ కుమార్, పరమేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.