డిసెంబర్ 7, 8 తేదీల్లో శంషాబాద్ లో జరిగే బికేఎంయు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి నరసింహ అన్నారు. శుక్రవారం దేవరకొండలో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని, అందులో భాగంగానే బడ్జెట్లో నిధులను తగ్గించారన్నారు. ఈ కార్యక్రమంలో వెంగళయ్య, భారీములు, వెంకట్రాములు, యాదయ్య, గణేష్, తదితరులు పాల్గొన్నారు.