దేవరకొండ లగచర్ల బాధితులకు మద్దతుగా, వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని సచివాలయం ముట్టడికి వెళ్తున్న పలువురి లంబాడీ నేతలను సోమవారం దేవరకొండ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. లగచర్ల ఘటనలు దారుణమని, ప్రతి ఒక్కరూ ఖండించాలని గిరిజన నేతలు అన్నారు. అరెస్టైన వారిలో జనసేన పార్టీ నేత చందు నాయక్, బిఆర్ఎస్ కు చెందిన నరసింహ నాయక్, దస్రు నాయక్ తదితరులు ఉన్నారు.