యుఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. పరుశురాం పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణ శివారులోని మోడల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అధ్యయనం ఐక్యత పోరాటం అనే నినాదంతో విద్యారంగ సమస్యలపై పోరాడుతున్న యుఎస్ఎఫ్ఐ మహాసభలు డిసెంబర్ 14, 15 తేదీల్లో విజయవాడలో జరుగనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సౌభాన్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.