సీపీఐ 100 వసంతాల సందర్బంగా డిసెంబర్ 30న నల్గొండలో జరిగే బహిరంగసభను జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం దేవరకొండలో జరిగిన సీపీఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం, ఫ్యూడల్ సంస్థానాల విముక్తి, పీడిత ప్రజల కోసం వేలాది మంది ప్రాణాలను కోల్పోయిన ఏకైక పార్టీ సీపీఐ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, అంజి, వెంకట్రాములు, తదితరులు పాల్గొన్నారు.