నల్గొండ జిల్లా దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడి సీజ్ అయిన వాహనాలను ఈ నెల 29న వేలం వేయనున్నట్లు సీఐ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనేవారు 29వ తేదీ శుక్రవారం 10 గంటలలోపు ద్విచక్ర వాహనాలకు 10 వేలు, నాలుగు చక్రాల వాహనాలకు 30 వేలు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనాలని, వేలంలో వాహనాలు దక్కని వారికి తిరిగి డిపాజిట్ చెల్లిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.