బీబీనగర్: ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోం: జైపాల్ రెడ్డి
బీబీనగర్ మూసీ సుందరీకరణ కు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని మూసీ ప్రక్షాళన పేరుతో పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం ప్రజల పక్షాన పోరాటం చేస్తామని బొక్క జైపాల్ రెడ్డి, రచమల్ల శ్రీనివాసులు కాంగ్రెస్ ప్రభుత్వాని హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి గత పది సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పనులు ఏ గ్రామానికి వెళ్ళినా కనిపిస్తాయని అన్నారు.