తెలంగాణ పల్లెల్లో సర్పంచ్ ఎన్నికల ఫీవర్ మెుదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కొందరు ఆశావహులుమేనిఫెస్టోలు ప్రకటిస్తూ గ్రామాల్లో ఎన్నికల వాతావరణం తెస్తున్నారు. తాజాగా.. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో సర్పంచ్‌గా తనను గెలిపించాలంటూ కొడారి లత మల్లేశ్ మేనిఫెస్టో విడుదల చేసింది. ఆడపిల్ల పుడితే రూ.5 వేలు, ఉచిత మంచి నీరు, ఇంటి పన్ను ఫ్రీ, ఎవరైనా మరణిస్తే 20 వేలు ఇస్తామంటూ ఆమె ఇచ్చిన హామీలు ఆశ్చర్యపర్చాయి.