కులగణనతో వ్యక్తిగత వివరాల సేకరణ తగదు
సర్వే పేరుతో వ్యక్తి గత వివరాల సేకరణ చేయడం తగదని సీపీఐ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జి పులిజాల పరశురాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనాభా లెక్కల్లో కులగణన చేయాలనే చర్చ నేపథ్యంలో ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తుందని అన్నారు. ఈ సర్వే పత్రంలో కులంతో పాటు ఆస్తులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో కూడిన ప్రశ్నలు ఉన్నాయని, ఆ వివరాలు ఇవ్వడానికి ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు.