నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 117వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి. ఆంజనేయులు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం. బాల నరసింహ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్ త్యాగం అనితర సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐఎస్ఎఫ్, ఏవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.