నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఉప్పల్ పహాడ్ గ్రామంలో శనివారం ప్లాస్టిక్ వాడకూడదంటూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ కార్యదర్శి కస్తూరి కృష్ణయ్య మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించారు. ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బంది రజిత, సంతోషి, నిర్మల, ఉమాదేవి గ్రామస్తులు పాల్గొన్నారు.