నా కొడుకు సీఎం అవుతాడు: ఫడణవీస్ తల్లి

71பார்த்தது
నా కొడుకు సీఎం అవుతాడు: ఫడణవీస్ తల్లి
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి మెజారిటీ పొందడంతో త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సీఎం పదవీకి పోటీ నెలకొన్న నేపథ్యంలో.. ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ తల్లి సరిత కీలక ప్రకటన చేశారు. తన కొడుకే సీఎం అవుతారని అన్నారు. అతను 24 గంటలూ కష్టపడుతున్నాడని, తన సోదరీమణులందరూ ఆయన్ను ఆశీర్వదించారని మీడియాతో చెప్పారు. బీజేపీ స్టేట్ చీఫ్ చంద్రశేఖర్ కూడా ఫడణవీస్ ఇంటికి చేరుకొని అభినందించిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி