సంగారెడ్డి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైనట్లు పట్టణ సిఐ భాస్కర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరణించిన వ్యక్తి వయసు 60 నుంచి 65 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. పట్టణంలో వివిధ వస్తువులు అడుక్కుంటూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు రాత్రి సమయంలో నిద్రిస్తున్నట్లు చెప్పారు. ఎవరికైనా తెలిస్తే 8712656718 నెంబర్ కు ఫోన్ చేయాలని తెలిపారు.