విద్యార్థులకు చెత్త ప్రాసెసింగ్ విధానముపై అవగాహన

50பார்த்தது
విద్యార్థులకు చెత్త ప్రాసెసింగ్ విధానముపై అవగాహన
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛతలో ముందుంచాలని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకట్ తెలిపారు. హుస్నాబాద్ పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవ 2024 కార్యక్రమంలో భాగంగా డిఆర్సిసి, కంపోస్ట్ షెడ్ ల వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకట్ హాజరై విద్యార్థులకు చెత్త విభజనపై అవగాహన, చెత్త ప్రాసెసింగ్ అయ్యే విధానాలను వివరించారు.