ప్రతినిత్యం వ్యాయామంతో ఆరోగ్యం పదిలంగా ఉండే అవకాశాలు మెరుగవుతాయని ప్రతి ఒక్కరూ, ప్రతిరోజు వ్యాయామం చేయాలని టిపిసిసి సభ్యులు కేడం లింగమూర్తి అన్నారు. హుస్నాబాద్ మండలంలోని మాలపల్లి గ్రామంలో ఓపెన్ జిమ్ నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో మనిషికి శారీరక శ్రమ తగ్గిపోయిందని తద్వారా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు.