పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు అందరూ సహకారం అందించాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత కోరారు. హుస్నాబాద్ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తాగునీటి ఇబ్బందులు తొలగించడానికి మిత్రమండలి-87 ఆధ్వర్యంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి నీటిశుద్ధి యంత్రం ఏర్పాటు చేయించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.