సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం నల్లం పల్లిలో గ్రామంలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియురాలి భర్తపై ప్రశాంత్ అనే యువకుడు పక్కా స్కెచ్ తో దాడికి యత్నించాడు. కృష్ణ కంట్లో కారం పొడిని చల్లి ఇనుప రాడ్ తో తలపై కొట్టి అతిదారుణంగా హత్యచేసాడు ఆ కసాయి ప్రేమికుడు. అనంతరం నేరుగా వెళ్లి రాయికోడ్ పోలీసులకు లొంగిపోయాడు.