సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అన్నసాగర్ చెరువులో దూకి వివాహిత మహిళ స్వాతి (27) ఆత్మహత్య కు పాల్పడింది. మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన బుడగజంగాల కులానికి చెందిన వివాహిత స్వాతి అత్తింటి వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. భర్తతో గొడవపడి పుట్టింటికి వస్తున్న క్రమంలో అన్నసాగర్ వద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చర్చించుకున్నారు. మృతురాలి పుట్టిల్లు జోగిపేట్ కావడంతో సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యవంతం అయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.