దసరా సందర్భంగా సింగరేణి యాజమాన్యం పలు గనులు, విభాగాలలో కార్మికులకు విందు ఏర్పాటు చేయడం సరి కాదని దానికి బదులుగా బహుమతులు అందించాలని ఏఐటియూసి ఉప ప్రధాన కార్యదర్శులు వీరభద్రయ్య, సమ్మయ్య తెలిపారు. దసరా సందర్భంగా కార్మికులు తమ కుటుంబ సభ్యులతో గడపాలని చూస్తారని తెలిపారు. అలాంటప్పుడు యాజమాన్యం ఏర్పాటు చేసే విందుకు ఎవరు వస్తారని వారు ప్రశ్నించారు.