సింగరేణి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం పేర్కొన్నారు. హైదరాబాదులోని ప్రజాభవన్లో సంస్థ లాభాలకు సంబంధించిన చెక్కులను మంచిర్యాల జిల్లా కార్మికులకు అందించారు. లాభాల వాటాను వేతన ఖాతాలో జమ చేస్తున్నట్లు ప్రకటించారు. 2023- 24 లో సంస్థ సాధించిన లాభాల్లో 33 శాతం బోనస్ చెల్లించడం జరిగిందన్నారు.