జాతీయ బిసి సంక్షేమ సంఘం మందమర్రి పట్టణ సోషల్ మీడియా ఇంఛార్జ్ గా కూకట్ల తిరుపతి యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సకినాల శంకర్ నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం తిరుపతి యాదవ్ మాట్లాడుతూ బిసి కులగణన జరిగే వరకు సోషల్ మీడియా ద్వారా బిసిలను ఏకం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోనున్నట్లు తెలిపారు.