ప్రజలకు సమస్య వస్తే వెంటనే తమను సంప్రదించాలని.. పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కేనని గుర్తించుకోవాలని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. సోమవారం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర షీటీం ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో పోస్టర్లను విడుదల చేశారు. ఎవరైనా ఆన్లైన్ యాప్స్, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులు, లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన సమాచారం అందించాలన్నారు.