పోరాటాలే ప్రజా సమస్యలకు పరిష్కారమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ అన్నారు. శుక్రవారం మందమర్రి పట్టణంలో జరిగిన సీపీఎం జిల్లా 3వ మహాసభల్లో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు నోచుకోవడం లేదని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడిచిన అనేక గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని తెలిపారు. జిల్లా అభివృద్దికి జరిగే పోరాటాలకు ప్రజలు సిద్దం కావాలని కోరారు.