ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ఆర్డీవో లు రాములు, హరికృష్ణ, డిఆర్డిఓ కిషన్ తో కలిసి ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.