వరి ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. తేమశాతం సరిగా ఉన్న రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. మంచిర్యాల హాజీపూర్ మండల కేంద్రం తో పాటు కర్ణమామిడి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పలుచోట్ల తూకం వేసే యంత్రాలు లేకపోవడంతో నిర్వాహకులపై మండిపడ్డారు.