మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్ లో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ ప్రారంభించిన ఈ శిబిరంలో 115 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. జ్వరాలు, అసంక్రమణ వ్యాధులు నివారించడానికి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డిఎంహెచ్ఓ తెలిపారు.