రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే మందమర్రిలో శుక్రవారం ప్రారంభమైంది. మున్సిపల్ పరిధి 18వ వార్డులోని గాంధీ నగర్, ఒర్రె గడ్డ కాలనీలలో ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాకుల వారీగా ఇంటింటికీ వెళ్లి ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ జావిద్ ఖాన్, బూడిద శంకర్, ఐలయ్య, శ్రీనివాస్, సమ్మయ్య పాల్గొన్నారు.