మందమర్రి మండలంలోని శంకర్పల్లి గ్రామపంచాయతీ శివారులో అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న పాలవాగులు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గౌరీ శంకర్ మంగళవారం తెలిపారు వీటిని పోలీస్ స్టేషన్ కు తరలించి మైనింగ్ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఓ ట్రాక్టర్ యజమాని అవమానంతో అధికారులతో వాగ్వాదానికి దిగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.