కోటపల్లి మండలంలోని నక్కలపల్లి లోతొర్ర వాగుకు మరమ్మతులు చేసి చుట్టు పక్క గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దపల్లి పురుషోత్తం డిమాండ్ చేశారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మేల్యే వివేక్ అనేక వాగ్దానాలు చేసి, గెలిచాక ప్రజా సమస్యలు గాలికొదిలి పక్క నియోజకవర్గాలు తిరుగుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా చెన్నూర్ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని సూచించారు.