సింగరేణి సంస్థకు బకాయి పడ్డ రూ. 34 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని హెచ్ఎంఎస్ నాయకులు శ్రీనివాస్, రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మందమర్రి ఏరియాలోని శాంతి ఖని గని పై నిర్వహించిన గేట్ మీటింగ్ లో మాట్లాడారు. రాజకీయ జోక్యంతో గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు మళ్లించిందని, కరోనా, మెడికల్ ఫండ్, సిఎస్ఆర్ నిధుల పేరిట దార పోసిందని విమర్శించారు.