పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ కు వేతనాలు పెంచాలని ఇఫ్ టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందం కోరారు. ఈ మేరకు ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వినతిపత్రం సమర్పించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని దళిత అభివృద్ధి శాఖ బాయ్స్, అండ్ గర్ల్స్ పోస్టుమట్రిక్ హాస్టల్ లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు గత పది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.