వేమనపల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద యువతులకు కళ్యాణ లక్ష్మి పథకం వరం లాంటిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేమనపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.