బెల్లంపల్లిలో తెలంగాణ విగ్రహం ముందు వ్యాపారవేత్తలు చెత్త వేయడం వల్ల ఆవులు ప్లాస్టిక్ కవర్లు తిని అనారోగ్యానికి గురవుతున్నాయి. అదేవిధంగా గ్రౌండ్ ముందు ఎక్కడినుంచో వచ్చి చెత్తను అక్కడ వేస్తున్నారు. అలాంటి వారిపై మున్సిపల్ కమిషనర్ చైర్మన్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు.