అమలు కానీ అబద్దాలతో గద్దనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరుగుబాటు ప్రారంభమైందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. బుధవారం రాత్రి కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామపంచాయతీలోని 62 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ అసమర్ధ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు.