కాసిపేట మండలంలోని మామిడిగూడెంలో ప్రజలు జ్వరాలతో మంచం పట్టారు. వారం రోజులుగా వైరల్ ఫీవర్లు విజృంభిస్తుండగా గిరిజనం అవస్థలు పడుతున్నారు. రోజురోజుకు బాదితుల సంఖ్య పెరుగుతున్నది. ఏ వాడలో చూసిన జ్వర పీడితులు కనిపించడం ఆందోళనకు గురిచేస్తుంది. కీళ్లనొప్పులతో లేచి నడవలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 20 మందికి పైగా బాధపడుతుండగా మరి కొందరు ఆసుపత్రుల పాలయ్యారు.