చదువుతోనే అభివృద్ధి సాధ్యమని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. గురువారం కాసిపేట మండలంలోని రొట్టెపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన కొమరం భీం వర్ధంతికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆదివాసి సంప్రదాయాల నడుమ పూజలు చేసి భీమ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కొమరం భీం త్యాగం ఫలితంగానే ప్రస్తుతం అడవి బిడ్డలు స్వేచ్ఛగా బతుకుతున్నారని ఆయన సేవలను కొనియాడారు.