బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని జాతీయ రహదారికి ఆనుకుని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములు కాపాడి భవిష్యత్తు తరాల అవసరాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.