మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పురగిరి క్షత్రియ పెరిక సంఘం రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గ ఆడపడుచు, పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యరాణి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు కందుల రాకేష్ కుమార్ బెల్లంపల్లి పట్టణంలోని అమ్మ అనాధ ఆశ్రమంలో కేక్ కట్ చేసి పిల్లలకి స్వీట్స్ మరియు పండ్లు పంచిపెట్టడం జరిగింది. అలాగే వారి ఆశ్రమానికి 25 కిలోల బియ్యం తమ వంతు సాయంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల కష్టమే తన కష్టంగా భావించి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి కందుల సంధ్యారాణి జన్మదిన వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే సంధ్యారాణి భవిష్యత్తు రాజకీయాలలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి తన నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడాలని కోరారు. ఆవిడ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ, తాను వేసే ప్రతి అడుగులో పురగిరి క్షత్రియ పెరిక సంఘ యువజన విభాగం తోడుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సింగతి కిరణ్ కుమార్, నాయకులు సూరం తదితరులు పాల్గోన్నారు.